Radhe Shyam : కరోనా నేపథ్యంలో అనేక సినిమాలు వాయిదా పడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే సంక్రాంతికి విడుదల కావల్సిన ప్రభాస్ రాధే శ్యామ్ మూవీని వాయిదా వేశారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా ఉండడం, కరోనా ప్రభావం వల్ల జనవరి 14న విడుదల కావల్సిన మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలోనే డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. దీంతో అప్పట్లో చిత్ర నిర్మాతలు ఈ విషయంపై స్పందించారు. రాధే శ్యామ్‌ను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఇవే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ బడా స్ట్రీమింగ్ సంస్థ రాధే శ్యామ్‌ను కొనుగోలు చేసేందుకు భారీ డీల్‌ను ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
కానీ తాజాగా వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ ఖండించలేదు. అయితే రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను ఓటీటీలో విడుదల చేస్తే నిర్మాతలకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. కనుక ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే చాన్సే లేదని విశ్లేషకులు అంటున్నారు.
సాధారణంగా ఓటీటీ యాప్స్ రూ.120 కోట్లు అంతకన్నా తక్కువ మొత్తంలో బడ్జెట్ పెట్టిన సినిమాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓటీటీ యాప్స్ ఒక మూవీకి గరిష్టంగా రూ.150 కోట్లను ఖర్చు చేయగలవని.. కానీ రాధే శ్యామ్ చిత్రాన్ని రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తీశారు కనుక.. తక్కువ మొత్తానికి చిత్రాన్ని ఎవరూ అమ్ముకోరని అంటున్నారు. కనుక రాధే శ్యామ్ ఓటీటీలో విడుదల కాదని, థియేటర్లలోనే విడుదలవుతుందని అంటున్నారు. దీనిపై చిత్ర నిర్మాతలు మళ్లీ స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…