Radhe Shyam : సాహో తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. జనవరి 14, 2022 తేదీన విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత రెబల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జోనర్ లో చేస్తున్న సినిమా.. రాధే శ్యామ్. ఈ సినిమాలో రెబల్‌స్టార్ ప్రభాస్ విక్రమాదిత్యగా ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ లో కనిపించబోతున్నారు. ఇది గొప్ప ప్రేమకథ అని మెషన్ పోస్టర్‌తోనే రివీల్ అయ్యింది.
వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే ప్రేమకథగా రాధే శ్యామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. ఆషికీ ఆగయా .. అంటూ సాగే హిందీ సాంగ్ తాజాగా విడుదలైంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌నే కాదు.. సినీ అభిమానులను కూడా అలరిస్తోంది.
బీచ్‌లో లైట్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉన్న డ్రెస్‌లో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్‌గా పాట సాగుతుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, బ్యూటీపుల్‌గా ఉన్నాయి. రాధే శ్యామ్ పూర్తి లవ్ యాంథమ్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.. దర్శక నిర్మాతలు.