PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె అందుకున్న పతకాలు భారతదేశ ఖ్యాతిని పెంచాయి. ఇటీవల కామన్‌వెల్త్ 2022 గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి ప్రతిష్టాత్మక పోటీల్లో స్వర్ణం గెలుపొందిన తొలి తెలుగు తేజంగా కీర్తి పొందింది. తాజాగా పీవీ సింధు ఆలీతో సరదాగా షోలో పాల్గొని తన ఫేవరేట్ హీరో, తనకు వచ్చిన ప్రేమలేఖలు వంటి తదితర ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇక షోలో ఆలీతో సింధు బాగానే సందడి చేసినట్లు కనిపిస్తోంది. ఆలీ మీకు నచ్చిన హీరో ఎవరని అడిగితే చాలామంది హీరోలు నచ్చుతారు అని సమాధానం ఇచ్చింది సింధు. వెంటనే ఆలీ ఎవరైనా ఒకరి పేరు చెప్పు అనడంతో ప్రభాస్ అని చెప్పింది సింధు. ఇక మేమిద్దరం చాలా మంచి స్నేహితులం అని కూడా చెప్పింది. దీంతో అలీ ఏంటి ఇద్దరు ఒకటే హైట్ అని ఇష్టమా అంటూ సరదాగా కామెంట్ చేయడంతో సింధు తెగ నవ్వింది. భవిష్యత్తులో హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా ? అన్న అప్రశ్నకు ఏమో.. నా బయోపిక్ కూడా ఉండొచ్చేమో ! అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది పీవీ సింధు.
అలాగే తనకు చదువుకునే రోజుల నుంచే లవ్ లెటర్లు వచ్చేవంటూ.. మా ఫ్యామిలీ మెంబర్సే అవి చదువుతారని నవ్వుతూ చెప్పింది. ఒకానొక సమయంలో 70 ఏళ్ల వ్యక్తి ప్రేమలేఖ రాసి, తనను పెండ్లి చేసుకోకపోతే కిడ్నాప్ చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపింది. మెడల్ తీసుకునేప్పుడు చేతిలో మన జాతీయ జెండా ఉంటుంది. అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది ? అని ఆలీ అడిగిన ప్రశ్నకు.. విదేశాల్లో మన జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు నాకైతే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి అని ఎమోషనల్ అయ్యింది సింధు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…