Pushpaka Vimanam : విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌లు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నాడు. తాజాగా పుష్పక విమానం సినిమాతో ప్రయోగం చేయబోతున్నాడు ఆనంద్. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ఇందులో శాన్వి మేఘన కథానాయికగా నటించింది.
పుష్పక విమానం చిత్రాన్ని నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను అల్లు అర్జున్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే, సుందర్ (ఆనంద్ దేవరకొండ) అనే స్కూల్ టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు ? అనేది ఆసక్తికరంగా సినిమాలో చూపించనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధమైంది.
ఓ ప్రభుత్వ లెక్కల మాస్టారు. పెళ్లి తరువాత సిటీకి వచ్చి సెటిల్ అవుతాడు. పెళ్లైన పది రోజులకే తన భార్య లేచిపోతుంది. భార్య ఇంట్లోనే ఉన్నట్టుగానే అందరినీ నమ్మిస్తాడు. హోటళ్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తన భార్య చేసిందని స్కూల్‌లో స్టాఫ్ అందరికీ వడ్డిస్తుంటాడు. అలా తన భార్య ఇంట్లోనే ఉందని నమ్మించేందుకు నానా కష్టాలు పడతాడు. లేచిపోయిందని చెప్పడానికి ఒక్క ఫ్రూప్ చూపించరా ? అని పోలీస్ క్యారెక్టర్‌లో ఉన్న సునీల్ అడిగితే.. ఆమె రాసిన లెటర్ ఉందంటూ హీరో ఆనంద్ చెబుతాడు. అదెక్కడ అని అంటే.. మింగేసా అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది.
చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ దక్కింది. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. సునీల్, నరేశ్, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…