Pushpa Movie : టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ వల్ల సుకుమార్‌కు మంచి పేరు రావడం మాత్రమే కాదు.. మరోవైపు బన్నీ, రష్మిక మందన్నలకు కూడా జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు లభించింది. బన్నీ, రష్మికలకు ఇప్పుడు ఆఫర్లు బాగానే వస్తున్నాయి. హిందీ మార్కెట్ నుంచి సైతం బన్నీతో సినిమా చేసేందుకు ఎంతో మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక పుష్ప మూవీకి రెండో భాగమైన పుష్ప 2 కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
అయితే పుష్ప సినిమాను ఇప్పటికే చాలా మంది చూసి ఉంటారు. అందులో క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది. ఎస్‌పీ భన్వర్ సింగ్ షెకావత్‌తో కలిసి పుష్ప చివర్లో మద్యం సేవిస్తుంటాడు. ఈ క్రమంలోనే పుష్ప ఒక డైలాగ్ వాడుతాడు. మనిషి క్యారెక్టర్ అనేది అతను ధరించే దుస్తుల్లో ఉండదని.. అతని వ్యక్తిత్వంపై అది ఆధార పడుతుందని అంటాడు. అయితే నిజ జీవితంలోనూ చాలా మందికి ఈ విధమైన సంఘటన ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంటే మన సమాజంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి.
ఒక వ్యక్తిని చూసే అతను ఎలాంటి వాడనేది సమాజం నిర్ణయిస్తుంది. ముఖ్యంగా అతను ధరించే దస్తులు వాటి బ్రాండ్ ను బట్టి అతని క్యారెక్టర్‌ను నిర్ణయిస్తుంది. అంతేకానీ అతను ఎలాంటి మంచి పనులు చేసినా సమాజం వారిని గుర్తించదు. ఇదే పుష్పలో చూపించారు. అక్కడ బ్రాండ్ అనేది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది కానీ.. అతను ధరించే దుస్తులను బట్టి ఉండదని చెప్పారు. ఇదే విషయం చాలా మందికి పర్సనల్‌గా ఎదురైన అనుబవమే. సుకుమార్ ఇలాంటి సీన్లను పెడతారు కనుకనే ఆయన మూవీలు హిట్ అవుతున్నాయని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…