Pushpa Movie : ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు స్నేహ భావంతో మెలుగుతున్నారు. ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అల్లు అర్జున్ సినిమాకి సపోర్ట్ అందిచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వివరాలలోకి వెళితే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రైజ్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో చిత్రమిది. ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్‌గా నటిస్తుండగా సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప ది రైజ్ చిత్రం డిసెంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు.
సమంత, బన్నీపై సాగుతున్న ఈ పాటతో చిత్రీకరణ ముగియనుంది. ఒకవైపు పుష్ప ది రైజ్ నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరో వైపు ప్రమోషనల్ ప్లాన్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఇండియాలో ప్రధానమైన నగరాలకు పుష్ప యూనిట్ వెళ్లి ప్రచారం చేసేలా ప్రణాళికలు వేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడట. ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…