Puneeth Rajkumar : కన్నడ నాట ప్రజలు శోకసంద్రంలో నిండిపోయారు. తాము ఎంతగానో అభిమానించే నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో హఠాన్మరణం చెందడాన్ని అభిమానుల జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ వద్దకు పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోగా.. ఇక ఆయన లేరు ఆయన విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన పునీత్ రాజ్ కుమార్‌ను బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో ఆయనకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నామని, ఆయన పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇంతలోనే ఆయన మరణవార్త అందరినీ కలచివేస్తోంది.
పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. హీరో నితిన్, సోనూసూద్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతోపాటు తారాలోకం అంతా పునీత్ మృతి పట్ల దిగ్భ్రాంతికి గురైంది. అందరూ ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. పునీత్ సడెన్‌గా మృతి చెందడం తనను షాక్‌కు గురి చేసిందని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి.. అని నితిన్ ట్వీట్ చేశారు.
నా గుండె పగిలింది, నిన్ను మిస్ అవుతున్నాను బ్రదర్.. అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. పునీత్ మరణం షాక్‌కు గురి చేసిందని, ఇంత సడెన్ గా ఆయన చనిపోవడం బాధగా ఉందని, మరణం అనేది ఎప్పుడైనా, ఎవరికైనా, ఎలాగైనా రావచ్చని.. ఉన్నంత కాలం హ్యాపీగా జీవించాలని.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
కాసేపట్లో సీఎం బసవరాజ్ బొమ్మై ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. పునీత్ భౌతిక కాయాన్ని కంఠీరవ స్టేడియానికి అభిమానుల సందర్శనార్థం తరలిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…