Punarnavi : తెలుగు ప్రేక్షకులకు పునర్నవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ బిగ్ బాస్ ద్వారా ఈమె ఎంతో పేరు తెచ్చుకుంది. అంతకు ముందు ఈమె పిట్టగోడ, ఉయ్యాల జంపాల వంటి సినిమాల్లో కనిపించింది. కానీ పెద్దగా ఈమెకు గుర్తింపు రాలేదు. తరువాత బిగ్ బాస్‌లో పాల్గొనడంతో బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా బిగ్ బాస్ ఇంట్లో రాహుల్‌కు, ఈమెకు మధ్య లవ్ ట్రాక్‌ను నడిపించారు. దీంతో అది బాగా వర్కవుట్ అయింది. అయితే అప్పట్లో రాహుల్ విన్ అయ్యేందుకు పునర్నవి కూడా ఒక కారణమని అన్నారు.
ఇక బిగ్ బాస్ తరువాత వీరు మళ్లీ కలసి కనిపించలేదు. అయితే వీరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. కానీ బిగ్ బాస్ అనంతరం ఎవరి దారి వారు చూసుకున్నారు. అంటే బిగ్ బాస్‌లో కావాలనే ఆ ట్రాక్ నడిపారని స్పష్టమవుతుంది. ఇక బిగ్ బాస్ అనంతరం పునర్నవి ఒక్క సినిమా లేదా వెబ్ సిరీస్‌లోనూ నటించలేదు. కానీ ఇటీవలే ఓ వెబ్ సిరీస్ మాత్రం చేసింది. అందులో భాగంగానే తనకు ఎంగేజ్‌మెంట్ అయిందని బాంబు పేల్చింది. కానీ అది ఆ సిరీస్ ప్రమోషన్స్ కోసం చేసిన ట్రిక్ అని తేలింది.

ఇక పునర్నవి సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అందులో ఆమె తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తన ఫొటోలను అసభ్యకరంగా వాడుకుంటున్నారని ఆ మధ్య ఆమె మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఈమె ఫొటోలు, వీడియోలు మాత్రం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా అంతర్జాతీయ యోగా డే సందర్భంగా పునర్నవి మరోమారు సోషల్ మీడియాలో నెటిజన్ల ముందుకు వచ్చింది. యోగా చేస్తున్న వీడియోను షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈమె ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తోంది.
View this post on Instagram