Priyamani : వల్లభ హీరోగా ఎవరే అతగాడు చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. తరువాత ప్రియమణి జగపతి బాబు సరసన నటించిన పెళ్ళైన కొత్తలో చిత్రం హిట్ అవ్వడంతో ఆమెకు క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన యమదొంగ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ప్రియమణికి స్టార్ స్టేటస్ ఏర్పడింది. తరువాత నవ వసంతం, ద్రోణ, శంభో శివ శంభో, గోలీమార్, రగడ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.
అదే టైంలో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల విరాట పర్వంలో కూడా నటించింది. అలాగే ప్రియమణి బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేసి మెప్పించింది. ఆమె చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ సిరీస్ కు బాలీవుడ్ లో కూడా ప్రియమణికి మంచి గుర్తింపు లభించింది. మరోవైపు ప్రియమణి బుల్లితెర షోల ద్వారా తన అందచందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఢీ డాన్సు ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి అప్పుడప్పుడూ సాంగ్స్ కి స్టెప్పులేస్తూ కుర్రాలను ఉత్సాహపరుస్తుంది.

ఇంకా చెప్పాలంటే ఈ షో కి స్పెషల్ ఎట్రాక్షన్ ప్రియమణి. టైం దొరికినప్పుడల్లా ఆమె డాన్స్ చేస్తూ మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది. అయితే రీసెంట్ గా ప్రియమణి ఓ సాంగ్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ చెమటలు చిందించింది. రెడ్ కలర్ ప్యాంట్ లో బాడీని ఊపేస్తూ నడుమును తిప్పేస్తూ తన వయ్యారాలను వలకపోస్తూ హాట్ హాట్ గా కుర్రాళ్లకు అందాల ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా ప్రియమణిని హీరోయిన్ గా తీసుకోండి డైరెక్టర్లు సినిమా సూపర్ హిట్ అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు.