Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌కి వివాదాలు కొత్త కాదు. ఆయన ఇటీవల జరిగిన మా ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసి హాట్ టాపిక్‌గా నిలిచాడు. ఇక తాజాగా హిందీలో మాట్లాడిన వ్యక్తి చెంప పగలగొట్టి వార్తలలోకి ఎక్కాడు. వివరాలలోకి వెళితే.. ప్రకాశ్ రాజ్ రీసెంట్‌గా ఓటీటీలో విడుదలైన జై భీమ్ చిత్రంలో నటించాడు. ఈ లీగల్ డ్రామాను టి. జె. జ్ఞానవేల్ దర్వకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మించారు.
జై భీమ్ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటోంది. అయితే సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ వ్యక్తి చెంప పగలగొట్టే సీన్ వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రంలో ఐజీ పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఓ వ్యక్తిని విచారిస్తాడు. సౌత్ భాషల్లో విడుదలైన ప్రకారం ఆ సమయంలో ఆ సదరు వ్యక్తి హిందీలో మాట్లాడతాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ అతని చెంప పగలగొట్టి, స్థానిక భాషలో మాట్లాడమంటాడు.
Prakash Raj with his propaganda in the movie ‘Jay Bhim’ where he slaps a person who speaks in Hindi. pic.twitter.com/1SwPVssbK7
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) November 2, 2021
అయితే హిందీలో మాత్రం ఈ సన్నివేశాన్ని ‘నిజం చెప్పు’ అనేలా డబ్ చేశారు. ఇప్పుడు ఈ సీన్ పై కాంట్రవర్సీ మొదలైంది. హిందీ భాషను తక్కువ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. చిత్ర బృందం దీనిపై క్లారిటీ ఇచ్చింది. తమకు అలాంటి ఉద్దేశం లేదని, కేవలం కథాపరంగానే ఆ సన్నివేశం వచ్చిందని సమాధానం చెబుతున్నారు. “జై భీమ్” సామాజిక, రాజకీయ అంశాలతో కథ ముడి పడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇందులో రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపించారు.