Prakash Raj : సౌత్ ఇండియా మల్టీ టాలెంటెడ్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఈ వీక్ లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన జై భీమ్ సినిమాలో ఓ స్పెషల్ సీన్ కోసం రీసెంట్ గా మళ్ళీ వివాదానికి గురయ్యారు. నటనలో ఎంతోమంచి పేరు సాధించిన ప్రకాష్ రాజ్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ.. విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమా ప్రస్తుతం మంచి హిట్ టాక్ ని సంపాదించుకుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ హిందీలో డైలాగ్స్ చెప్పే వ్యక్తిని తమిళంలో మాట్లాడాలని చెబుతూ చెంప దెబ్బ కొట్టే సీన్ ఉంది. ప్రస్తుతం ఈ విషయం పెద్ద వివాదానికి గురైంది. ఫైనల్ గా ఈ విషయంలో ప్రకాష్ రాజ్ స్పందించారు. జై భీమ్ సినిమాలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని మీరు చూడకపోతే.. చెంపదెబ్బ కొట్టడం.. మీ ఎజెండాను బహిర్గతం చేస్తుందని.. ప్రకాష్ రాజ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
స్క్రీన్ పై ప్రకాష్ ఉన్నందుకు కొంతమందికి ఈ చెంపదెబ్బ సీన్ చిరాకు తెప్పించిందని, ఈ సినిమాలో అన్యాయం జరిగిందని, మనం న్యాయంగా ఉండాలని అన్నారు. జై భీమ్ సినిమాలో ప్రకాష్ రాజ్ పెరుమాళ్ స్వామిగా ఇన్ స్పెక్టర్ జనరల్ పాత్రలో యాక్ట్ చేశారు. 1993 లో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పై వివాదం సద్దుమణిగిందని, ఆయన రిలాక్స్ అవుతారని.. అంతా అనుకుంటున్నారు.