Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఏమోగానీ వివాదం మరింత ముదురుతోంది. మరోవైపు మంచు విష్ణు తాజాగా తిరుపతిలో ప్రెస్‌మీట్ పెట్టి.. తమకు అసలు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు 11 మందికి చెందిన రాజీనామాలు అందలేదని స్పష్టం చేశారు. రాజీనామాలు అందితే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే మరోవైపు ప్రకాష్ రాజ్.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు.
మా ఎన్నికలు జరిగిన ఆ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఎన్నికల అధికారికి ఇప్పటికే ఆయన సీసీటీవీ ఫుటేజ్ కోసం దరఖాస్తు చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేని చెప్పారు. దీంతో ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే ప్రకాష్ రాజ్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకోవచ్చని మంచు విష్ణు చెప్పాక.. ఆయన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చేరుకోవడం సంచలనంగా మారింది.
స్కూల్‌లో ఎన్నికల రోజు సీసీటీవీ ఫుటేజ్‌ను ప్రస్తుతం ప్రకాష్ రాజ్ బయటకు తీసే పనిలో ఉన్నారు. ఆ రోజు గొడవలు, దాడులు జరిగాయని చెబుతుంటే ఎవరూ నమ్మడం లేదని, కనుక సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే పోలీసులు సైతం స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…