Pragya Jaiswal : నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన ప్రగ్యా జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాను ఇప్పటివరకు అన్ని మంచి పాత్రలను ఎంపిక చేసుకున్నానని అయితే అవి ప్రేక్షకులను సందడి చేయడం, చేయకపోవడం మన చేతుల్లో ఉండదని తెలిపారు. అయితే బోయపాటి సినిమాలో బాలకృష్ణ అంతటి సీనియర్ హీరోతో నటించడం ఇదే మొదటి సారి అని, అలాంటి సీనియర్ హీరో సరసన నటించాలంటే మొదట ఇబ్బంది పడ్డానని, అయితే ఆయనను కలిసిన 5 నిమిషాలకే చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యానని తెలిపారు.
బయట బాలకృష్ణ గురించి అందరూ చెప్పిన విధంగా బాలయ్య ఉండరని, ఆయన ఎంతో సరదాగా అందరితోనూ ఉంటారని తెలిపారు. క్రమశిక్షణ విషయంలో మాత్రం బాలకృష్ణ ఎంతో స్ట్రిక్ట్ అని ఆమె తెలిపారు. ఆయన అలా నడుచుకుంటూ సెట్ లోకి వస్తే మిగిలిన వారందరూ సైలెంట్ అయ్యేవారని, అలా ఆయన క్రమశిక్షణ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని, అఖండ సినిమాలోని తన పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని, తన పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని.. ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ వెల్లడించింది.