Prabhas : డార్లింగ్ ప్రభాస్ కి అమ్మాయిల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షం సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. ఇంకా ఛత్రపతి మూవీతో ప్రభాస్ లో మాస్ ఎలిమెంట్స్ ని బయటకు తీసాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆ మూవీతో ప్రభాస్ సూపర్ స్టార్ డమ్ మరింత పెరిగిపోయింది. మిర్చి మూవీలో ప్రభాస్ స్టైల్, మ్యానరిజం, డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి ప్రభాస్ ని ఎక్కడికో తీసుకుపోయింది. బాహుబలి 2 తో ఖండాంతరాలకు రీచ్ అయ్యాడు.
మొరటుగా కనిపిస్తూ కరుకుగా డైలాగ్స్ చెప్పే ప్రభాస్ మాస్ హీరోగా మాత్రమే నిలదొక్కుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ అన్నివర్గాల ప్రేక్షకులు అభిమానించే హీరోగా ఎదగడానికి ప్రభాస్ కి ఎక్కువ టైం పట్టలేదు. మంచి హైటూ.. పర్సనాలిటీ.. ఫిట్ నెస్ తో కనిపించే ప్రభాస్ అమ్మాయిల కలల్లో గ్రీకువీరుడు అయ్యాడు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభాస్ లుక్ అస్సలు బాగోలేవని, అతడు ఆరోగ్యం మీద, ఫిట్ నెస్ మీద శ్రద్ద పెడితే బావుంటుందని పలువురు విమర్శించారు. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమా షూటింగ్ అప్పుడు బాలీవుడ్ ట్రోలర్స్ ప్రభాస్ లుక్ పై తీవ్ర విమర్శలు చేశారు.

తాజాగా ప్రభాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫోటోల్లో ప్రభాస్ లుక్స్ అస్సలు బాగలేవు. అస్సలు అది మన డార్లింగ్ ప్రభాసేనా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. ప్రభాస్ చాలా లావుగా, ముసలాడి లాగా దారుణంగా ఉన్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ మళ్లీ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి ఒకప్పటి మిర్చి ప్రభాస్ ని చూడాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల కోరికను డార్లింగ్ వింటాడో లేదో చూడాలి.