Prabhas : ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ లేదని ఆ సినిమా నుంచి తొలగించిన డైరెక్టర్.. ఎవరో తెలుసా..!

Prabhas : ఆరడుగుల కటౌట్ తో హీరో అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటుంది ప్రభాస్ లుక్. ఈశ్వర్ చిత్రంతో వెండితెరపైకి అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  ప్రభాస్ బిహేవియర్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరో అయినప్పటికీ కూడా సెట్స్ లో  అందరితో మంచిగా కలిసిపోతాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలవాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కూడా ప్రభాస్ ముఖంలో ఎప్పుడు కూడా కొంచమైనా గర్వం కనిపించలేదు. ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరిస్తాడు. అందుకే ప్రభాస్ ని ముద్దుగా ఇండస్ట్రీలో అందరూ డార్లింగ్ అని పిలుచుకుంటారు.

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఈ ఒక సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్ వంటి పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ప్ర‌భాస్ ప‌క్క‌న ఒక్క సినిమాలోనైనా నటించే ఛాన్స్ వస్తే చాలనుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శక, నిర్మాత‌లు కూడా ప్ర‌భాస్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Prabhas

ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోని ఒకప్పటి రోజుల్లో ఓ దర్శకుడు ప్రభాస్ కి స్టార్ డమ్ లేదని ఓ చిత్రం నుంచి తొలగించడం జరిగింది. ఆ సినిమా నుండి తొల‌గించినా కూడా ఆ సినిమా ఆడియో లాంఛ్ కు గెస్ట్ గా వెళ్లి చిత్ర‌యూనిట్ ను అభినందించాడు ప్రభాస్. ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే.. విక్టరీ వెంకటేష్, ఆసీన్  జంటగా నటించిన ఘర్షణ చిత్రం. 2004లో  విడుద‌లై ఈ సినిమా అప్పటిలో మంచి విజ‌యం సాధించింది. . పోలీస్ పాత్ర‌లో వెంక‌టేష్ చాలా అద్భుతంగా నటించారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ఘర్షణ సినిమాకు మొద‌టగా ప్ర‌భాస్ ను హీరోగా ఎంపిక చేశారు. సినిమా ప్రారంభించడం కోసం పూజ‌కార్య‌క్ర‌మాలు కూడా నిర్వహించారు. కానీ అప్పటికే ఈశ్వర్, రాఘవేంద్ర చిత్రాలతో ప్లాప్స్ అందుకున్న ప్రభాస్ కు ప్రేక్షకులలో క్రేజ్ త‌క్కువ‌గా ఉంద‌న్న కార‌ణంతో దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రభాస్ ని ప‌క్క‌న పెట్టి వెంక‌టేష్ ను హీరోగా ఎంపిక చేశార‌ట‌.  ఇక ఈ సినిమా మిస్ చేసుకున్న‌ ప్ర‌భాస్ అదే ఏడాది వర్షం చిత్రంతో సక్సెస్ ను అందుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM