Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అతని కుటుంబం ప్రస్తుతం తీరని శోకంలో ఉన్నారు. ప్రభాస్ పెదనాన్న సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. కృష్ణంరాజు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. టాలీవుడ్ ప్రముఖులు సైతం కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపారు.
తన వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన పెదనాన్న దూరం కావడంతో పెద్ద దిక్కు కోల్పోయాను అంటూ ప్రభాస్ కుమిలి కుమిలి ఏడ్చిన దృశ్యం అందర్నీ కలచివేసింది. ప్రభాస్ ని ఇంత బాధలో చూసి అభిమానులు కూడా తట్టుకోలేకపోయారు. ఈ విషాద సమయంలో ప్రభాస్ కి కాస్త ఊరట కలిగించే మంచి వార్త వచ్చింది. ప్రభాస్ కి అరుదైన ఆహ్వానం అందింది.
దేశ రాజధాని ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో దసరా పర్వదినం రోజు జరిగే రావణదహనం కార్యక్రమానికి హాజరు కావాలని రామ్ లీలా కమిటీ సభ్యులు ఆహ్వానం పంపించారు. దసరా ఉత్సవాలకు ప్రభాస్‌ను విశిష్ట అతిథిగా హాజరుకావాలని రామ్ లీలా కమిటీ సభ్యులు కోరారు. వారి ఆహ్వానం మేరకు ప్రభాస్‌కు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు వార్త విన్పిస్తుంది. గతంలో రావణ దహనం కార్యక్రమానికి అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి నటులు హాజరు కాగా.. ఈ ఏడాది ప్రభాస్‌కు ఆహ్వానం అందడంతో డార్లింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి మూవీతో పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్‌కు భారీగా క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పౌరాణిక గాథ రామాయణం ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆదిపురుష్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మూవీ మేకర్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీరాముడి గెటప్ లో ప్రభాస్ ఎలా ఉండబోతాడో అనే ఉత్కంఠతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…