Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న చిత్రాలలో రాధే శ్యామ్ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ఇటీవల ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ పాట ఆలస్యం అయినప్పుడు.. ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేయని సమయంలో అభిమానులు ఏ రేంజ్ లో యూవీ క్రియేషన్స్ ను ట్రోల్ చేశారో తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ సినిమాలపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. అంతేకాదు ప్రభాస్‌పై తమ ప్రేమను తెలియజేసేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ ని ఓ వీరాభిమాని కలిశాడు. అతడు తన తలపై ప్రభాస్ అని అక్షరాలు కనిపించేలా జుట్టు కట్ చేసుకున్నాడు. అది చూసి ప్రభాస్ నవ్వుకున్నాడు. అతడి అభిమానానికి ముచ్చటేసిన ప్రభాస్ కొద్ది సమయం పక్కన కూర్చోబెట్టుకుని సరదాగా మాట్లాడాడు.
ఆ వీరాభిమానికి ఖరీదైన వాచ్ ను కూడా బహుమానంగా ప్రభాస్ అందజేశాడు. ప్రస్తుతం ఆ వీరాభిమాని ఫొటో, ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ వాచ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ మంచి మనసు మరోసారి ఇలా నిరూపితం అయ్యింది.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ పూర్తి చేయగా, వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఆ చిత్రం విడుదల కానుంది. మరోవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…