Prabhas : యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఇది వరకు ఒక సినిమా విడుదలైన తర్వాత మరొక సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్లేవారు. అయితే ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో కొన్ని సినిమాలను కూడా సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ఇలా రాధేశ్యామ్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ సలార్, ఆది పురుష్ చిత్రాలను సెట్స్ పైకి తీసుకు వెళ్లారు.
ఈ రెండు చిత్రాలు మాత్రమే కాకుండా ప్రాజెక్ట్ కే, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మరొక సినిమా, సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలను కూడా ప్రకటించారు. ఇలా వరుస సినిమాలను ప్రకటిస్తూ ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరొక సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రభాస్ ఇలా వరుస సినిమాలు చేస్తూ రూ.కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ప్రభాస్ చేతిలో ఉన్న ఈ సినిమాలన్నింటినీ పూర్తి చేస్తే ఆయనకు ఏకంగా రూ.600 కోట్ల రెమ్యునరేషన్ అందుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. ఇకపోతే ఇలా వరుస సినిమాలను అనౌన్స్ చేయడం వెనుక ఒక కారణం ఉందని కూడా సమాచారం. ప్రభాస్ కు ప్రస్తుతం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కావడం చేత ఇలా సినిమాలను అనౌన్స్ చేసి వాటి ద్వారా వచ్చే అడ్వాన్స్ ను ఒక పని కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది.