Adipurush : కార్తికేయ 2 చిన్న సినిమాగా విడుదలై ఎవరూ ఊహించని అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీ కృష్ణుడి గురించిన చరిత్రను తెలుపుతూ భక్తి భావంతో తీసిన ఈ చిత్రానికి హిందీ భాషలో కూడా ఉత్తరాది హిందూ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో కేవలం రూ.20 కోట్ల నుండి రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటేసింది.
ఇక శ్రీ కృష్ణుడి గొప్పదనాన్ని చాటి చెప్పడం వలననే కార్తికేయ 2 చిత్రం ఘన విజయం సాధించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే తరహాలో భారత దేశంలో ఎక్కువగా పూజించబడే శ్రీ రాముడిపై ఆయన గొప్ప దనాన్ని, ఘన కీర్తిని చూపించే విధంగా రాబోయే ప్రభాస్ సినిమా ఆదిపురుష్ కూడా ఊహకందని విజయం సాధిస్తుందని, థియేటర్లు రామ మందిరాలుగా మారిపోతాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ కచ్చితంగా పెద్ద నేషనల్ స్టార్ అయిపోతాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాదు బాహుబలి సినిమా రికార్డులను కూడా కేవలం 2 వారాల్లోనే బ్రేక్ చేయబోతుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ చిత్రంలో రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్న సంగతి ఇదివరకు తెలిసిందే. ఆయన చాలా గొప్ప నటుడు అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయనతోపాటు ఇంకొందరు నటులపై వ్యతిరేక ప్రచారం జరుగుతున్నందు వలన దీని ప్రభావం ఆదిపురుష్ చిత్రంపై పడుతుందేమోనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ అలా గానీ జరిగితే ఈ సినిమా కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బాయ్ కాట్ ముప్పును ఎదుర్కొన వలసి వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా ఫలితాన్ని భవిష్యత్తు మాత్రమే నిర్ణయిస్తుంది. కనుక ఏం జరుగుతుందో తెలియాలంటే.. సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడక తప్పదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…