Posani Krishna Murali : పవన్ వర్సెస్ వైసీపీ నుంచి పవన్ వర్సెస్ పోసానిగా మారిన మాటల యుద్ధం చివరకు దాడుల వరకు వెళ్లింది. పవన్ అభిమానులు పోసానిపై దాడులు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పోసాని ఇంటిపై బుధవారం అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఇదే విషయమై పోసాని ఇంటి వాచ్ మెన్ మాట్లాడుతూ.. అర్థరాత్రి సమయంలో కొందరు పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేశారని, దీంతో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని అన్నాడు. అయితే ఈ ఘటనపై వాచ్‌మెన్ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై స్థానికులు స్పందిస్తూ.. అర్థరాత్రి సమయంలో రాళ్ల దాడి జరగడంతో భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. పవన్ కల్యాణ్ అభిమానులే ఈ విధంగా చేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. అయితే పవన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి పోసాని అమీర్‌పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న తన ఇంట్లో నివాసం ఉండడం లేదని, ఆయన వేరే చోటకు మారారని తెలుస్తోంది.
కాగా పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను వారు పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…