Posani : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, పోసాని కృష్ణమురళి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఆగ్రహ జ్వాలలు తారా స్థాయికి చేరుకున్నాయి. రిపబ్లిక్ మూవీ ఫంక్షన్‌లో పవన్ వ్యాఖ్యలపై పోసాని కౌంటర్ ఇవ్వగా.. అందుకు పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసానికి వేలాదిగా కాల్స్ చేస్తూ మెసేజ్‌లు పెట్టారు.

అయితే తనను ఆ విధంగా పవన్ ఫ్యాన్స్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి పోసాని మరోమారు ఫైర్ అయ్యారు. పవన్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను ఇష్టం వచ్చినట్లుగా బండ బూతులు తిట్టారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఇంకా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పోసాని కృష్ణమురళిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోసాని కృష్ణ మురళిని పట్టుకునే దాకా వదలమని, ఆయన ఇంటిని ముట్టడిస్తామని పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. పోసాని ఓ పిచ్చికుక్క అని అతన్ని రాళ్లతో కొట్టి చంపుతామని అంటున్నారు. విమర్శలు చేయాలికానీ బండ బూతులు తిట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కుటుంబాలను వివాదాల్లోకి లాగుతున్న పోసాని ఒక మెంటల్ వ్యక్తి అని విమర్శించారు.
పవన్‌ను విమర్శించినవారందరూ ఏమైపోయారో ఒక్క సారి పోసాని గుర్తు తెచ్చుకోవాలని అంటున్నారు. లేదంటే వారికి పట్టిన గతే పోసానికి కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఓ వైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి, పోసానికి సంబంధం ఏమిటని వారు నిలదీస్తున్నారు. అయితే ఇది చిలికి చిలికి గాలి వానగా మారింది. ఈ వివాదం ఎలా సద్దు మణుగుతుందో చూడాలి.