Poonam Kaur : నటి పూనమ్ కౌర్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. వివాదాస్పద పోస్టులు పెడుతూ వాటిని వెంటనే తీసేస్తోంది. దీంతో ఆమె పెట్టే పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. తన జీవితాన్ని ఒక వ్యక్తి, ఒక దర్శకుడు నాశనం చేశారని.. ఇప్పటికే ఆమె పలు సార్లు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మరోసారి మీడియా ఎదుట ఇదే విషయాన్ని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతం అయింది.
పూనమ్‌కౌర్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం నాతి చరామి. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. దీన్ని ఏకంగా 20 ఓటీటీల్లో స్ట్రీమ్ చేయనున్నారు. అందులో భాగంగానే నిర్వహించిన మీడియా సమావేశంలో పూనమ్ కౌర్ కన్నీటి పర్యంతం అయింది. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో కలలతో వచ్చానని.. కానీ కొందరు రావణాసురులు తన కలను నాశనం చేశారని.. పూనమ్ కౌర్ కన్నీరు పెట్టుకుంది. కొందరు తన జీవితాన్ని నాశనం చేశారని ఆమె వ్యాఖ్యలు చేసింది. చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందంటూనే ఆమె భావోద్వేగానికి గురైంది. దీంతో పక్కనున్న వారు ఆమెను ఓదార్చారు. తన జీవితాన్ని కొందరు నాశనం చేసినందునే ఈ రోజున తాను సీత, దుర్గ, ద్రౌపదిలను తలచుకుని ధైర్యం చేసి జీవిస్తున్నానని తెలియజేసింది. అయితే ఓ దశలో సినిమాలను వదిలేసి ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిపోదామని అనుకున్నానని.. కానీ ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి తనకు ఈ సినిమా కథ చెప్పిందని.. ఇందులో మహిళ ప్రాధాన్యత అంశం ఉంటుందని చెప్పిందని.. అందుకనే నాతి చరామి సినిమాలో నటించానని తెలియజేసింది. ఈ క్రమంలోనే పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…