సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో చనిపోయిన పూర్వీకులకు మగవారు పిండ ప్రదానం చేయడం మనం చూస్తుంటాం. ఈ విధంగా పిండ ప్రదానం చేసే సమయంలో శాస్త్రం ప్రకారం మగవారే ప్రదానం చేయాలి. అయితే పిండ ప్రదానం చేయడానికి కేవలం పెద్ద కుమారుడు మాత్రమే అర్హుడని చెబుతారు. ఒక వేళ పెద్ద కుమారుడు జీవించి లేకపోతే రెండవ కుమారుడు పూర్వీకులకు పిండ ప్రదానం చేయాలి.
ఇలా పిండ ప్రదానం చేసే సమయంలో ఎప్పుడూ మగవారే పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అమ్మాయిలు పిండ ప్రదానం చేయకూడదా.. చేస్తే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి.. అనే సందేహాలు చాలామందికి వ్యక్తమవుతున్నాయి. అయితే శాస్త్రం ప్రకారం అమ్మాయిలు పిండ ప్రదానం చేయవచ్చా.. లేదా.. అనే విషయాలను తెలుసుకుందాం.
శాస్త్రం ప్రకారం పిండ ప్రదానం చేయడానికి మగవారు అర్హులు. అయితే అబ్బాయికి పెళ్లి జరిగి ఉంటే ఆ పిండ ప్రదాన కార్యక్రమాలలో పాల్గొనడానికి అమ్మాయికి అర్హత ఉంటుంది. పిండ ప్రదానానికి కావలసిన వాటన్నింటిని అమ్మాయి చేస్తుంది కనుక పిండ ప్రధాన సమయంలో అమ్మాయి పాల్గొనవచ్చు. ఇకపోతే కొడుకులు లేని తల్లిదండ్రులకు కూతురే అన్నీ తానై తమ తల్లిదండ్రులకు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కనుక అబ్బాయిలు లేకపోతే తల్లిదండ్రులకు ఆడపిల్లలు కూడా పిండ ప్రదానం చేయవచ్చు.