Pethanna : సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తె’. దీపావళి కానుకగా ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘పెద్దన్న’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. ‘అన్నాత్తె’ సినిమా తెలుగు రైట్స్‌ను ఏషియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ శనివారం విడుదలైంది. వెంకటేష్ చేతుల మీదుగా టీజర్ ను విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీజర్‌లో ప్రేక్షకులకు కావలసినంత యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని చెప్పవచ్చు. ఇందులో రజనీ చెప్పే డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఈ సినిమాలో నయనతార, సీనియర్ నటి కుష్బూ, మీనా, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు వంటి సీనియర్ నటీనటులు కూడా కీలకపాత్రలను పోషించారు. ఈ సినిమాకు డి.ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత హైలెట్ అయిందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమా 4వ తేదీన విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…