Pawan Kalyan Watch Price : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో పవన్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ‘సాహో’ లాంటి హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో పవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమా చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించిన డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఓజీ అనే ఆసక్తికర టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాను సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో హాజరు అయ్యారు. అయితే పవన్ పెట్టుకున్న హ్యాండ్ వాచ్ హైలెట్ గా మారింది. అభిమానులు వాచ్ పై ఫోకస్ పెట్టారు అభిమానులు. తాజా సమాచారం ప్రకారం.. పవన్ ధరించిన వాచ్ ‘పనేరాయ్’ అనే ప్రముఖ కంపెనీకి చెందిందని.. దాని ధర దాదాపు రూ. 13.52 లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది.

పవన్ రేంజ్‌కి అది తక్కువేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ధరించిన వస్తువులపై అభిమానులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ వాటికి సంబంధించి ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలో పవన్ వాచ్ గురించి కూడా వివరాలు రాబట్టారు. ఇక ఓజీ సినిమాలో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడట. చాలాకాలం తర్వాత పవన్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూడబోతున్నామని ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించనుండగా.. తమన్ ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే అయ్యాడు.