Pawan Kalyan : పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది చేదు వార్తే అని చెప్పాలి. ఇది వారికి నిజంగా ఊహించని షాకే అని చెప్పవచ్చు. ఎందుకంటే వపన్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అవును.. తాజాగా జరుగుతున్న పరిణామాలతోపాటు భవిష్యత్తులో ఏర్పడనున్న పరిస్థితులను బట్టి చూస్తే పవన్ సినిమాలకు గుడ్ బై చెబుతారని అంటున్నారు. అయితే పవన్ ఇంత సడెన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంటారా.. అని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కానీ ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పక తప్పదని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ 50 శాతం పూర్తయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంకో 3 లేదా 4 నెలల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుంది. అయితే అక్టోబర్ 5 నుంచి పవన్ బస్సు యాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుందని.. ఆయన 6 నెలల పాటు ఈ యాత్ర చేస్తారని సమాచారం. రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. అయితే 6 నెలలు అంటే వచ్చే ఏడాది 2023 అవుతుంది. ఆ తరువాత ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో సినిమాలు చేయలేరు. ఎన్నికలు, పొత్తులు, ప్రచారం, అభ్యర్థుల ఎంపిక అని సవాలక్ష పనులు ఉంటాయి. కనుక పవన్‌కు ఉన్నది వచ్చే అక్టోబర్ 5 వరకు ఉన్న సమయం మాత్రమే. ఆలోగా హరిహర వీరమల్లు ఒక్కటే పూర్తవుతుంది. కనుక అదే పవన్‌కు ఆఖరి చిత్రం అని అంటున్నారు.
ఇక భవదీయుడుడు భగత్‌సింగ్, సురేందర్ రెడ్డితో సినిమా, వినోదయ సీతమ్ చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఇవి ఇంకా ప్రారంభం కాలేదు. అయితే పవన్‌కు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఈ సినిమాలను చేయకపోవచ్చని తెలుస్తోంది. కనుక ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రమే ఆఖరిది అవుతుందని అంటున్నారు. 2024 లో జరగనున్న ఎన్నికల కోసం పవన్ సినిమాలకు గుడ్‌బై చెబుతారని తెలుస్తోంది.
అయితే 2019లోనూ ఇలాగే అన్నారు. కానీ పవన్ ఎన్నికల్లో ఓటమి అనంతరం మళ్లీ సినిమాలు తీయడం మొదలు పెట్టారు. కనుక ఎన్నికలు జరిగే వరకు పవన్ సినిమాలకు దూరంగా ఉంటారని అంటున్నారు. ఆ తరువాత ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిస్తే పవన్ ఇక శాశ్వతంగా సినిమాల వైపు చూడకపోవచ్చు. అదే ఓడితే మళ్లీ సినిమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి పవన్ భవితవ్యం ఎలా ఉండబోతుందో చూడాలి. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం పవన్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు.