Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు చెబితే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకం వస్తుంది. అప్పట్లో ఈయన చిరంజీవి తమ్ముడిగానే పరిచయం అయ్యారు. కానీ తన సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో పైకి వచ్చారు. ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ టాలెంట్ లేక, లక్ కలసి రాక చాలా మంది ఇప్పటికీ సరైన హిట్ కోసం వేచి చూస్తున్నారు. కానీ పవన్ అలా కాదు. బ్యాక్ గ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా టాలెంట్‌తో పైకి ఎదిగారు. పవర్ స్టార్ అయ్యారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నారు.
అయితే పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం విదితమే. కానీ ఆయన మొదటి పెళ్లికి ముందు.. ఇంకా సినిమాల్లోకి రానప్పుడు పవన్ అప్పట్లో చెన్నైలో చిరంజీవి ఇంట్లో ఉండేవారు. ఆ సమయంలో ఆయన అక్కడ కంప్యూటర్ కోచింగ్‌కు వెళ్లేవారు. అయితే ఆ క్లాస్‌కు ఒక అమ్మాయి వచ్చేది. తనతోనే పవన్ లవ్‌లో పడ్డారు. ఆ అమ్మాయి వాస్తవానికి చాలా అందంగా ఉండేదట. ఎవరితోనూ మాట్లాడేది కాదట. కానీ పవన్‌తో మాట్లాడేదట. దీంతో క్లాస్‌మేట్స్ పవన్‌తో.. అది ప్రేమే అని.. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలని పవన్‌కు సూచించారట. అయితే పవన్ వాళ్లను తిట్టాడట.

కానీ కొంత కాలం తరువాత పవన్ కూడా అది ప్రేమే అయి ఉంటుంది కాబోలు అని ఆ అమ్మాయిని కారులో బయటకు తీసుకెళ్లాడట. ఆ తరువాత ప్రపోజ్ చేశాడట. అయితే ఆమె మాత్రం.. నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత.. నాకు నువ్వంటే ఇష్టం లేదు.. అని పవన్ ముఖంపైనే చెప్పేసిందట. ఆ తరువాత ఆమె అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలో పవన్ చాలా కాలం పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడట. అయితే ఈ విషయం బయటకు తెలిసేది కాదు. కానీ స్వయంగా పవనే దీని గురించి చెప్పారు. ఆయన అప్పట్లో గోకులంలో సీత మూవీ చేసినప్పుడు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. అలా పవన్‌కు పెళ్లికి ముందే ఒక లవ్ స్టోరీ ఉందన్నమాట.