OTT : ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్ల కన్నా ఓటీటీల్లోనే మూవీలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకనే ఓటీటీ యాప్‌లు సైతం వీలైనంత త్వరగా కొత్త మూవీలను తమ తమ ప్లాట్‌ఫామ్‌లపై ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకనే వారం మారే కొద్దీ కొత్త కొత్త మూవీలు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న మూవీలు, సిరీస్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాప్ గన్ మావెరిక్ అనే హాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లను సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ ఇప్పటివరకు ఏకంగా 1 బిలియన్ డాలర్ల గ్రాస్‌ను వసూలు చేసింది. అయితే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 24వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ అయిన ఢిల్లీ క్రైమ్ రెండో సీజన్ ఈ నెల 26వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ తొలి సీజన్ హిట్ అయింది. అందుకనే రెండో సీజన్‌ను రిలీజ్ చేస్తున్నారు.
ఇక హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టలోన్ నటించిన సమారిటన్ అనే ఇంగ్లిష్ మూవీ కూడా ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 25వ తేదీన రిపీట్ అనే సిరీస్‌ను స్ట్రీమ్ చేయనున్నారు. డ్రామా జోనర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర నటించాడు.
రాచసన్ అనే తమిళ మూవీకి రీమేక్‌గా రూపొందిన కట్ పుట్లి అనే హిందీ మూవీని సెప్టెంబర్ 2వ తేదీన నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయడం లేదు. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…