Karate Kalyani : నటి కరాటే కల్యాణి ఎరక్కపోయి సమస్యల్లో చిక్కుకుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆమె చెప్పినట్లు ఆమె ఉద్దేశం సరైందే అయినప్పటికీ కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది అన్నట్లు కల్యాణికి చెందిన ఇంకో వైపును కూడా పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె దగ్గర పెంచుకుంటున్న బిడ్డను ఆమె కొనుగోలు చేసిందా.. చట్ట ప్రకారం దత్తత తీసుకుందా.. అనే కోణంలో అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే వారు ఆదివారం ఆమె ఇంట్లో అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు.
కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించి ఆమె పెంచుకుంటున్న బిడ్డను ఆమె కొనుగోలు చేసిందా.. లేక దత్తత తీసుకుందా.. తీసుకుంటే అందుకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో వారు ఆరాలు తీశారు. దీంతో ఈ విషయం చిలికి చిలికి గాలి వానగా మారుతుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కల్యాణి తల్లి విజయలక్ష్మి స్పందించారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ కల్యాణి ఎలాంటి తప్పు చేయలేదని.. ఆ బిడ్డను ఆమె దత్తత తీసుకుందని.. అందుకు సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయని అన్నారు.
ఇక ఆమె ఇప్పటికే 12 ఏళ్ల అబ్బాయిని పెంచుతుందని.. అందులో భాగంగానే ఇంకో బిడ్డను దత్తత తీసుకుందని విజయలక్ష్మి చెప్పారు. డిసెంబర్ 25న ఆ ఆడ శిశువు జన్మించగా.. ఆమెను 28వ తేదీన దత్తత తీసుకుందని తెలిపారు. అంతేకానీ తన కుమార్తె ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. అయితే ప్రాంక్ వీడియోలు చేసే యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై కాకుండా అధికారులు కల్యాణి ఇంటిపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారంటే.. ఇందులో ఏదో మతలబు ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో నిజానిజాలు త్వరలోనే తెలియనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…