NTR Samantha : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా బుల్లితెరపై సైతం తన హవా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎవరు మీలో కోటీశ్వరుడు.. ఇక్కడ మనీతో పాటు మనసుల్ని కూడా గెలుచుకోవచ్చు.. లాంటి ప్రోగ్రామ్ తో మరింత సక్సెస్ అవుతున్నారు. లేటెస్ట్ గా ఈ ప్రోగ్రామ్ కి సమంత గెస్ట్ గా రానుంది. నవరాత్రి స్పెషల్ ప్రోమోగా విడుదలైన ఈ షార్ట్ అండ్ స్వీట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. సమంత, నాగచైతన్యల డైవోర్స్ తర్వాత స్మాల్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ చేయబోతోంది.
ఈ ప్రోమోలో ఎన్టీఆర్.. సమంతను ఆహ్వానించారు. కూర్చుంటేనే భయంగా ఉందంటూ సామ్ ఎక్స్ ప్రెషన్స్ అద్బుతంగా ఉన్నాయి. ఏది ఏమైనా సామ్ లో ఇంతకు ముందు కనిపించిన జోష్, యాక్టివ్ నెస్ అస్సలు లేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా అందరూ వెయ్యి నుండి కోటి రూపాయలకు వెళ్తుంటే.. నువ్వు మాత్రం కోటి నుండి వెయ్యికి వచ్చావని అన్నారు. దీంతో సమంత.. అయితే నాకు డబ్బులు వద్దు అంటుంది.. వద్దా అని ఎన్టీఆర్ అడగ్గా మళ్ళీ కావాలని అడుగుతుంది. ఫైనల్ గా తన అభిమానుల కోసం బుల్లితెరపై నవరాత్రుల్లో దసరా కానుకగా సందడి చేయనుందని అధికారికంగా ప్రకటించేశారు.
ఇక సమంత విడాకుల నేపథ్యంలో ఆమె తన సోషల్ మీడియోలో చేసే పోస్టులపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సామ్ దే తప్పంటుంటే మరికొంతమంది విడాకులనేది వారి పర్సనల్ విషయాలని ఆమెకు మద్దతు తెలిపారు. సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారలతో పాటుగా కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తోంది. మరికొన్ని సినిమా ప్రాజెక్ట్స్ తో తన కెరీర్ ని ముందుకు సాగించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఇక తన విడాకుల క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా స్పందించడంతో చాలా వరకు ఈ వివాదం సైలెంట్ అయ్యింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…