Ramya Krishnan : తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎంతో కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. పెళ్లి వల్ల ఇండస్ట్రీకి కొంత కాలం పాటు దూరం అయినా.. తరువాత తల్లి, అత్త వంటి పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. ఇక బాహుబలిలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది. ఈ క్రమంలోనే ఆమె శివగామిగా పాపులర్ అయ్యారు. అయితే అప్పట్లో ఎన్‌టీఆర్‌తో చేసిన ఓ సినిమాలో ఓ పాట సందర్బంగా ఆయన రమ్యకృష్ణకు సారీ చెప్పారు. అయితే అందుకు రమ్యకృష్ణ కూడా ఫర్వాలేదని సమాధానమిచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అప్పట్లో ఎన్టీఆర్, భూమిక, అంకిత హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎన్టీఆర్ పూర్తి మాస్ క్యారెక్టర్‌లో అలరించారు. అయితే ఇదే మూవీలో ఓ ఐటమ్ సాంగ్‌లో రమ్యకృష్ణ చేశారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణతో డ్యాన్స్ చేసేందుకు ఎన్టీఆర్ ఇబ్బందులు పడ్డారట. అసలు ఈ ఐటమ్ సాంగ్‌లో రమ్యకృష్ణ చేస్తుంది అనగానే ఎన్‌టీఆర్ తనకు ఓకే కానీ.. ఆమె సీనియర్ నటి కదా.. ఐటమ్ సాంగ్‌కు ఒప్పుకుంటారా.. అని ఎన్‌టీఆర్ అడిగాడట. అయితే ఎన్‌టీఆర్‌తో కలసి డ్యాన్స్ చేయాలని చెప్పగానే ఆమె ఉత్సాహంగా ఓకే చెప్పారట. దీంతో ఐటమ్ సాంగ్ పూర్తయింది.
అయితే ఐటమ్ సాంగ్ చేస్తున్న సమయంలో రమ్యకృష్ణ కన్నా ఎన్‌టీఆరే తెగ ఇబ్బంది పడ్డాడట. ఆమెను వీలైనంత వరకు టచ్ చేయకుండానే డ్యాన్స్ చేద్దామని ట్రై చేశాడట. కానీ వీలు కాలేదు. దీంతో ఐటమ్ సాంగ్ చేశాక తారక్ ఆమెకు సారీ చెప్పాడట. అయితే ఇందులో సారీ చెప్పాల్సింది ఏముంది.. ఇది యాక్టింగే కదా.. ఫర్వాలేదు.. డ్యాన్స్ బాగా చేశారు.. అంటూ ఆమె తారక్‌ను పొడిగారట. అలా సింహాద్రి ఐటమ్ సాంగ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సాంగ్ పట్ల నెగెటివ్ టాక్ వచ్చింది. ఎన్‌టీఆర్ ఆమెను బాగా నలిపేశాడని అన్నారు. కానీ వాస్తవానికి జరిగింది అది. అయితే ఇవన్నీ పక్కన పెట్టిన ప్రేక్షకులు సినిమాను మాత్రం సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇది ఎన్‌టీఆర్ కెరీర్ లో ఒక బెస్ట్ మూవీగా నిలిచిందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…