NTR : యువతరం అగ్ర హీరోల్లో ఎన్‌టీఆర్ ఒకరు. ఈయనకు ఉన్న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ దృష్ట్యానే కాదు.. ఈయన చేసే డ్యాన్స్, నటన పరంగా కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. తాత ఎన్టీఆర్ అడుగు జాడల్లోనే నడుస్తున్న ఎన్టీఆర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే నటనలో తానేంటో నిరూపించుకున్న ఎన్‌టీఆర్ అప్పుడప్పుడూ తన ఫ్యాన్స్‌తో మాట్లాడి వారి సరదా తీరుస్తుంటారు. ఇక ఎన్‌టీఆర్ ఈ విధంగా చేసిన పని ఏమోగానీ.. ఆయనకు అది కొత్త తలనొప్పులను తెచ్చి పెట్టింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఎన్‌టీఆర్ ఇటీవల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఓ అభిమానితో మాట్లాడారు. అతనికి నేనున్నాంటూ ధైర్యం చెబుతూ భరోసాను ఇచ్చారు. అయితే ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ఫోన్ తెరపై ఓ నంబర్ కనిపించింది. దీంతో అది ఎన్‌టీఆర్ నంబరే అని భావించిన వారు దాన్ని షేర్ చేశారు. ఇక ఈ ఫోన్ నంబర్ లీక్ కావడంతో ఫ్యాన్స్ అసలు ఊరుకోవడం లేదు. ఆ నంబర్‌కు తెగ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఫోన్ నంబర్ లభిస్తే ఎవరూ ఊరుకోరు కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఆ ఫోన్ నంబర్‌కు కాల్స్ చేస్తూ బిజీ అయ్యారు.

అయితే వాస్తవానికి ఇలాంటి ఫోన్ కాల్స్ చేసేటప్పుడు వారు ముందుగానే జాగ్రత్త పడతారు. అది ఎన్‌టీఆర్‌కు చెందిన మేనేజర్‌దో లేక ఆఫీస్ నంబరో అయి ఉంటుందని.. అందువల్ల దానికి ఫోన్ కాల్స్ చేసినా వేస్టేనని అంటున్నారు. ఇక దీనికి తోడు శివమణి సినిమాలో ఫోన్ కాల్స్‌ను ఆన్సర్ చేసే షేక్ ఇమామ్ పేరిట మీమ్స్ కూడా వస్తున్నాయి. అయితే అది ఎన్‌టీఆర్ నంబరేనా.. కాదా.. అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
https://twitter.com/vamsikaka/status/1542117306087911424