NTR Krishna : టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే అగ్ర హీరోల మ‌ధ్య జ‌రిగిన పోటీ.. ఆ త‌రువాత మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి పోటీని చూడ‌లేదు..!

NTR Krishna : సినీ ఇండస్ట్రీలో అగ్ర తార‌ల మ‌ధ్య పోటీ ఉండ‌డం స‌ర్వ సాధార‌ణం. కొంద‌రు హీరోల మ‌ధ్య ఈ పోటీ మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. వీరి సినిమాలు విడుద‌ల అయిన‌ప్పుడు ఎవ‌రు విజ‌యం సాధిస్తారా అని అంద‌రూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్టీఆర్ – ఏఏన్ఆర్‌, ఎన్టీఆర్ – కృష్ణ‌, కృష్ణ – శోభ‌న్ బాబు, చిరంజీవి – బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ – మ‌హేశ్ బాబు.. వీరు టాలీవుడ్ లో అతి పెద్ద పోటిదారులు అని మ‌నంద‌రికీ తెలిసిందే. వీరి సినిమాలు ఒకేసారి విడుద‌ల అవ్వ‌డం అవి ర‌స‌వ‌త్త‌రంగా మార‌డం, కొన్ని సార్లు గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం కూడా జ‌రుగుతుంటాయి. కానీ సినీ చరిత్ర‌లో 1977 లో జ‌రిగిన మ‌హా స‌మ‌రం మాత్రం ఎప్ప‌టికీ మ‌రువ లేనిది. అలాంటి పోటీ అంత‌కు ముందు.. ఆ త‌రువాత ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. అస‌లు ఆ పోటి ఎవరి మ‌ధ్య, ఎప్పుడు జ‌రిగింద‌నే వివ‌రాల‌లోకి వెళితే..

NTR Krishna

1976 లో ఎన్టీఆర్ దాన వీర శూర క‌ర్ణ సినిమాను, కృష్ణ కురుక్షేత్రంఅనే సినిమాను పోటా పోటీగా నిర్మించారు. ఆ రెండు చిత్రాలు కూడా పౌరాణిక చిత్రాలే కావ‌డం మ‌రో విశేషం. కృష్ణ సినీ ఇండ‌స్ట్రీలో అగ్ర స్థానంలో ఉన్న రోజుల్లో ఎన్టీఆర్ తో పోటీ ప‌డ్డారు. వీరిద్ద‌రి మ‌ధ్య అంత స‌ఖ్య‌త కూడా లేని రోజులవి. ఆంధ్ర దేశం అంతా వీరిద్ద‌రి సినిమాల గురించే మాట్లాడుకునే వారు. పత్రిక‌ల‌లో వీరి సినిమాల గురించే ప్ర‌త్యేకంగా ప్ర‌చురించేవారు. దాన వీర శూర క‌ర్ణ సినిమాను అంతా తానై ఎన్‌టీఆర్‌ నిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రాల‌ల్లో న‌టించారు. కురుక్షేత్రం సినిమాలో కృష్ణ, శోభ‌న్ బాబు, కృష్ణం రాజు క‌లిసి న‌టించారు. ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు విడుద‌ల అవుతాయ‌ని ఎన్టీఆర్‌, కృష్ణ వేర్వేరుగా ప్ర‌క‌టించారు.

ప్ర‌జ‌లంద‌రూ ఈ సినిమాల గురించి ఎంత‌గానో చ‌ర్చించుకునే వారు. దీంతో ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌నే ఉద్దేశంతో పోలీసులు కూడా అప్ర‌మ‌త్తం అయ్యారు. 1977 జ‌న‌వ‌రి 14 సంక్రాంతికి ఈ సినిమాలు విడుద‌ల అయ్యాయి. థియేట‌ర్ల‌ను ఎంత‌గానో అలంక‌రించారు. గోడ‌ల‌కు ఎటు చూసినాన ఈ రెండు సినిమాల‌ పేర్లే క‌నిపించేవి. 10 పండుగ‌లను ఒకే రోజు జ‌రుపుకుంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఈ రెండు సినిమాలు విడుద‌ల అయిన రోజున‌ ఆంధ్ర దేశం ప‌రిస్థితి కూడా అలాగే ఉంది.

ఇక సినిమా క‌లెక్ష‌న్ల విష‌యానికి వ‌స్తే మొద‌టి వారం కురుక్షేత్రం సినిమాకు రూ.22 ల‌క్ష‌లు వ‌చ్చాయి. త‌రువాతి రోజుల్లో ఈ సినిమా అంత‌గా ఆడ‌లేదు. ఎన్టీఆర్ న‌టించిన దాన వీర శూర క‌ర్ణ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఈ మ‌హా సంగ్రామంలో ఎన్టీఆర్ విజ‌యం సాధించారు. ఆ త‌రువాత కూడా ఎన్టీఆర్, కృష్ణ సినిమాలు పోటా పోటీగా విడుద‌ల అయిన‌ప్ప‌కీ ఈ త‌ర‌హా పోటీ ఎప్పుడూ లేదు. ఇప్పటి వ‌ర‌కు టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఏ హీరోల మ‌ధ్య కూడా ఇలాంటి పోటీని ప్రేక్ష‌కులు చూడ‌లేదు.

Share
D

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM