Niharika : కొణిదెల నిహారిక ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మళ్లీ రీ యాక్టివేట్ చేసింది. దీంతో మళ్లీ అందులో పోస్టులు పెడుతోంది. అయితే అందులో తాను జిమ్ ట్రెయినర్ మీద ఎక్కి కూర్చున్న వీడియోను మాత్రం డిలీట్ చేసింది. అంటే ఆమె ఆ విధంగా చేయడం వల్ల అత్తింటి వారు తిట్టారని.. కనుకనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు స్పష్టమైంది. అయితే ఇప్పుడదంతా గతం. తన భర్త చైతన్యతో కలసి ఆమె తెగ ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమె భర్తతో కలసి ఇటీవల జోర్దాన్‌కు టూర్ వెళ్లి వచ్చింది. ఇక తాజాగా మళ్లీ ఆమె జిమ్‌లో సందడి చేసింది.
నిహారిక ఫిట్‌నెస్ విషయంలోనూ ఎంతో శ్రద్ధ వహిస్తుంది. అయితే గతంలో ఆమె తన జిమ్ ట్రెయినర్‌తో చేసిన వీడియోనే వివాదాస్పదం అయింది. అతని మీదకు ఆమె ఎక్కి కూర్చోగా.. అతను పుషప్స్ చేశాడు. దీంతో ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది. అందరూ నిహారికను తీవ్రంగా విమర్శించారు. ఆ తరువాత ఆమె ఓ పబ్ లో తెల్లవారుజామున పట్టుబడింది. ఆమెపై డ్రగ్స్ కేసు నమోదు చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకోలేదని.. నాగబాబు వివరణ ఇచ్చినా.. అసలు ఆమె ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉంది ? నాగబాబు సమాధానం చెప్పాలని నెటిజన్లు ప్రశ్నించారు. కానీ దీనికి మాత్రం ఆయన దగ్గర సమాధానం లేకపోయింది.

ఇక నిహారిక తాజాగా తన భర్తతో కలిసి జిమ్‌లో సందడి చేసింది. తన జిమ్ ట్రెయినర్ ఓ నూతన జిమ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే ఆ జిమ్‌ను సందర్శించిన నిహారిక తన భర్తతో కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చింది. జిమ్ సెంటర్‌ను ఓపెన్ చేసినందుకు తన ట్రెయినర్‌కు ఆమె, ఆమె భర్త ఇద్దరూ కంగ్రాట్స్ కూడా చెప్పారు. అనంతరం ఆ ఫొటోను ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫొటో కూడా వైరల్ అవుతోంది. ఇక నిహారిక త్వరలోనే ఓ ప్రముఖ ఓటీటీ యాప్‌లో ట్రావెల్ షోను ప్రారంభిస్తుందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.