Niharika : మెగా డాటర్ నిహారిక గత కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తోంది. ఈ అమ్మడు హీరోయిన్ గా ఎదగాలన్న ఆశలతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు అరడజనుకు పైగా ఉన్న పరిశ్రమలో నిహారిక స్టార్ హీరోయిన్ కావడం పెద్ద విషయం కాదు. అయితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ పట్ల ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఆమెను ప్రోత్సహించలేదు. ఒక మనసు చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ తర్వాత మూడు నాలుగు సినిమాలు చేసింది. ఏవీ పెద్దగా విజయం సాధించకపోవడంతో పక్కకు తప్పుకుంది.

సినిమాల సంఖ్య తగ్గించిన నిహారిక పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయింది. అయితే అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం జిమ్ ట్రైనర్ మీద ఎక్కి కూర్చోగా అతను పుషప్స్ చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. కొందరు నెటిజన్స్ ఈ వీడియోపై మండిపడ్డారు. ఆమె పోస్ట్ అత్తమామలకు కూడా ఆగ్రహం తెప్పించిందట. తమ కోడలు పరాయి మగాడి వీపుపై కూర్చొని వ్యాయామాలు చేయడం అసలు నచ్చని మామయ్య ప్రభాకర్ రావు నిహారికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.
పద్ధతిగా ఉండాలని కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో నిహారిక ఏకంగా అకౌంట్ డిలీట్ చేసినట్లు సమాచారం. ఇన్‌గ్రామ్ లో ఆమె పేజీ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే రీసెంట్‌గా తిరిగి నిహారిక ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇస్తూ ఓ క్యూట్ పిక్ షేర్ చేసింది. అయితే జిమ్ ట్రైనర్‌తో కలిసి చేసిన వీడియో ఉందా అని చూస్తే అది తొలగించబడింది. అంటే ఈ వీడియో విషయంలో నిహారికతో అత్తింటివారు గట్టిగా మందలించడం వల్లనే ఆమె అకౌంట్ తొలగించినట్టు అర్ధమవుతోంది. కనుక ముందు నుంచి ఈ విషయంలో వస్తున్న పుకార్లే నిజమయ్యాయని అంటున్నారు. అయితే నిహారిక రానున్న రోజుల్లో ఏం చేస్తుందో చూడాలి.