Niharika : మెగా ఫ్యామిలీ వేడుకలకి సంబంధించిన ఏ ఫొటో, వీడియో అయినా బయటకు వచ్చిందంటే అది కొద్ది నిమిషాలలోనే వైరల్‌గా మారుతూ ఉంటుంది. రీసెంట్‌గా మెగా ఫ్యామిలీ కూడా క్రిస్మస్ పండగను ఘనంగా జరుపుకుంది. కొణిదెలవారి ఫ్యామిలీ, అల్లు వారి ఫ్యామిలీ ఒకే చోట చేరి తెగ సందడి చేశారు. మెగా వారసులంతా కలిసి ప్రేక్షకులకు మంచి క్రిస్మస్ ట్రీట్ ఇచ్చారు.
రామ్ చరణ్, తన భార్య ఉపాసన, అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులు, కొత్త జంట నిహారిక చైతన్యలతోపాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శ్రీజ తదితరులు ఒకే ఫ్రేమ్ కనిపించి ఫ్యాన్స్ కు కను విందు చేశారు. ముఖ్యంగా బావా బావమరుదులు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో కలిసినా మెగా అభిమానులు థ్రిల్ ఫీలవుతుంటారు.
పుష్ప హిట్ సూపర్ జోష్ లో ఉన్న బన్నీ.. ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే పుష్ప బ్లాక్ బస్టర్ అయి.. ఫుల్ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నా కూడా నాకు మంచి గిఫ్ట్‌లు కొనేందుకు సమయం వెచ్చించావ్.. థ్యాంక్యూ బన్నీ అన్నా.. కానీ వచ్చే ఏడాది మాత్రం ఇలా మోసం చేయకు అంటూ బన్నీ గురించి నిహారిక చెప్పుకొచ్చింది. నీ సీక్రెట్ శాంటాగా నేను ఉండటం ఇష్టం చరణ్ అన్న.. నాటు నాటు స్టెప్పులను మా అందరికీ ఎంతో ఓపిగ్గా నేర్పించినందుకు థ్యాంక్స్ అంటూ నిహారిక ఖుషీ అయింది.