Niharika Konidela : నిహారిక కొణిదెల పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా డాటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనంతరం ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా మారిపోయింది. ఇలా మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి వ్యక్తిగా నిహారిక పేరు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో యాంకర్ గా, హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
వివాహం తర్వాత సినిమాలకు దూరమైన నిహారిక నిర్మాతగా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇలా వైవాహిక జీవితంలో కూడా నిహారిక ఎంతో సంతోషంగా గడుపుతూ నిత్యం తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక ఉన్నఫలంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసింది.
అయితే నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేయడానికి కారణం ఏమిటి అని నెటిజన్లు పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జిమ్ కి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. అయితే ఈ వీడియో పై పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంతో నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈమె అకౌంట్ డిలీట్ చేయడానికి కారణం ఇదేనా.. లేకపోతే మరేదైనా కారణం ఉందా.. అనే విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…