Niharika Konidela : ఆదివారం తెల్లవారుఝామున బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే నిహారిక పట్టుబడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాత్రే అందరితోపాటుగా నిహారికను కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారట. అప్పటి నుంచి మెగా డాటర్ అక్కడే ఉన్నట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లింది.

అయితే నిహారిక వ్యవహారం ఇటీవలి కాలంలో హాట్ టాపిక్‌గా మారుతోంది. వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 2020, డిసెంబర్9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమా విశేషాలతోపాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేసుకునేది. కానీ అనూహ్యంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేసింది. అందుకు కారణం జిమ్‌లో ట్రైనర్‌తో అసభ్యంగా ప్రవర్తించడమే అని అందరూ అనుకున్నారు. కానీ నేనే డిలీట్ చేశానని నాగబాబు కవర్ చేశారు.
అయితే ఇప్పుడు నిహారిక పోలీసులకి పట్టుబడడాన్ని నాగబాబు ఎలా కవర్ చేస్తారా.. అని ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నీతులు చెప్పే నాగబాబు.. కూతురిని మాత్రం ఎందుకు అడ్డగోలుగా వదిలేస్తున్నాడు.. అని కామెంట్స్ పెడుతున్నారు. కేవలం మనం నీతుల వరకేనా, చేతలలో ఉండవా.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కూతురిని చక్కగా పెంచలేని వాడివి.. సమాజానికి ఏం సలహాలు, సూచనలు చేస్తావు.. అంటూ మండిపడుతున్నారు. అసలు ఈ వ్యవహారంపై నిహారిక కానీ నాగబాబు కానీ ఏదైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.