Niharika : మెగా డాటర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక చిత్రాల కంటే ముందు బుల్లితెరతో ప్రేక్షకులకు పరిచయం అయింది. కూతురికి కెమెరా ఫియర్ పోవడానికి నాగబాబు ముందుగా బుల్లి తెరకు పరిచయం చేశారు. ఢీ అల్టిమేట్ డాన్స్ షో ద్వారా నిహారిక బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ టైం లోనే జబర్దస్త్ షో ద్వారా నాగబాబు కూడా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. ప్రస్తుతం నాగబాబు జబర్దస్త్ షో, మల్లెమాల సంస్థపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. బయటకు వెళుతూ వెళుతూ అయిదారు వీడియోలు తీసి శ్యాం ప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ మీడియాలో పెట్టి మల్లెమాల సంస్థ పరువు తీశారు.
ఇప్పుడు స్టార్ మా, జీ తెలుగు, యూట్యూబ్ ఛానల్ అంటూ వాటి వైపు చూస్తున్నారు కానీ మల్లెమాల సంస్థ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తాజాగా మల్లెమాల సంస్థ విడుదల చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో మెగా డాటర్ నిహారిక మాత్రం ఈటీవీ మల్లెమాలలోకి తిరిగి అడుగు పెట్టింది. ఇది చూసినవారు కాస్త షాక్ కు గురయ్యారు. ఇదేంటి నిహారిక మళ్ళీ తిరిగి ప్రవేశించిందా, మొత్తానికి తండ్రి అక్కడ, కూతురు ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ రాబోయే చిరంజీవి బర్త్‌డే సందర్భంగా పాటలకు స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. నిహారిక కూడా హైపర్ ఆదితో పోటాపోటీగా తనదైన శైలిలో పంచులు వేస్తూ విడుదలైన ప్రోమోతో అందరినీ అలరించింది. నిహారిక రాకతో ప్రోమోకి కొత్త అందం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇది కూడా షోని హైలెట్ చేయడానికి మల్లెమాల చేస్తున్న ట్రిక్స్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని రోజులూ మల్లెమాలపై దారుణంగా ఆరోపణలు చేసిన నాగబాబు.. ఆయన కుమార్తెను మళ్లీ ఆ సంస్థలోకే ఎందుకు పంపించారు.. అనే విషయమే అందరికీ షాక్‌ను కలగజేస్తోంది. అంటే.. ఇదంతా.. పబ్లిసిటీ కోసమేనా అని చర్చించుకుంటున్నారు. దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.