Niharika : మెగా డాటర్ నిహారిక.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఈమె ఎంతో పేరు తెచ్చుకుంది. పలు వెబ్ సిరీస్‌లతోపాటు సినిమాల్లోనూ నటించి నటిగా గుర్తింపు పొందింది. అయితే సినిమాలు పరాజయం పాలు కావడంతో ఈమె మళ్లీ సినిమాల వైపు చూడలేదు. పెళ్లయ్యాక మాత్రం నిర్మాతగా మారి పలు సిరీస్‌లను నిర్మించింది. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నిహారిక ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేయడం సంచలనంగా మారింది. ఆమె ఎందుకు అలా చేసిందో అప్పట్లో తెలియలేదు. కానీ దాని వెనుక ఓ బలమైన కారణం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కొణిదెల నిహారికకు 2020వ సంవత్సరంలో డిసెంబర్ 9న చైతన్యతో వివాహం అయింది. కాగా అతను పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడు. ఇక వారి వివాహాన్ని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిపించారు. ఈ క్రమంలోనే వీరు ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. ఇక నిహారిక తనకు పుట్టింటి కన్నా అత్తింటిలోనే ఎక్కువగా స్వేచ్ఛ లభిస్తుందని.. ఇంట్లో అయితే తన తల్లి త్వరగా నిద్ర లేపుతుందని.. కానీ అత్తింట్లో అయితే బారెడు పొద్దెక్కినా ఎవరూ నిద్రలేపరని.. నిహారిక ఒక సందర్భంలో తన అత్తింటి వారిని మెచ్చుకుంది. అయితే ఆమెకు అంత స్వేచ్ఛ ఉన్నా.. ఆమె కొన్ని విషయాల్లో హద్దులు మీరి ప్రవర్తించిందని తెలిసింది.
ముఖ్యంగా నిహారిక తన జిమ్ ట్రైనర్ వీపు మీద కూర్చుని ఉండగా.. అతను పుషప్స్ చేశాడు. దీంతో ఆ వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోపైనే నిహారికకు తన అత్తింటి వారు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకనే నిహారిక మనస్థాపం చెందిందని.. ఈ క్రమంలోనే ఆ వీడియోను డిలీట్ చేయకుండా.. మొత్తం ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది ? అన్న విషయం తెలియాల్సి ఉంది..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…