Niharika : మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారింట్లో ఏదైనా వేడుక జరిగితే అందరూ ఒక్క చోట చేరి అభిమానులకి కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ ఉంటారు. అయితే మెగా బ్రదర్ నిహారిక పెళ్లి వేడుక గత ఏడాది ఎంత గ్రాండ్‌గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వ్యక్తిని వివాహమాడి సంతోషంగా జీవిస్తున్న నిహారిక ఇప్పుడు తన నాన్న దగ్గర కానీ, అత్త ఇంట్లో కానీ ఉండడం లేదని చెప్పింది.
బంధువులకు కూడా దూరంగా ఉంటున్నాం. హాస్టల్‌లో ఎప్పుడూ లేను. ట్రిప్ కూడా ఎప్పుడు సింగిల్‌గా వెళ్లలేదు. నాకు ఇప్పుడు పెళ్లయింది. కాబట్టి ఇప్పుడు అయినా విడిగా బతకాలని కోరుకున్నాం. విడివిడిగా కొన్ని రోజులు మమ్మల్ని విడిచిపెట్టమని మా పెద్దలను అభ్యర్థించాము, వారి అనుమతితో బయటకు వచ్చాము, అని నిహారిక పేర్కొంది. భర్త అంగీకారంతోనే సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన నిహారిక.. తన భర్త వరుణ్ తేజ్ చిన్నతనంలో క్లాస్‌మేట్ అనే విషయాన్ని కూడా పంచుకుంది.
నిహారిక ప్రస్తుతం నిర్మాతగానూ రాణిస్తుంది. జీ5 సంస్థ కోసం వెబ్ సిరీస్ చేస్తోంది. ఇందులో సంతోశ్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా సీనియర్ నరేశ్, తులసి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఐదు ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ నలబై నిమిషాల వ్యవధితో ఉంటుంది. నవంబర్ 19న ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.