Nidhhi Agerwal : నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ తెలుగులో అఖిల్ సరసన మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా గులాబీ రంగు చీర కట్టుకుని ఉన్న ఫోటోలని షేర్ చేయడంతో ఆ ఫోటోలు కొద్ది క్షణాలలోనే వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను షేర్ చేసిన నిధి అగర్వాల్.. అందమైన, అణకువ కలిగిన యువకుడి కోసం ఎదురు చూస్తున్నాను.. అంటూ క్యాప్షన్ పెట్టింది.
Looking for a Sundar and Susheel ladka 😁🧚🏻🧿✨💍🤍 pic.twitter.com/n7Rh19Y3hH
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) November 29, 2021
ఈ విధంగా క్యాప్షన్ పెట్టడంతో చాలా మంది నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై మనస్సు పడిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈమె ఫోటోలతోపాటు క్యాప్షన్స్ షేర్ చేస్తూ స్మైలీ ఎమోజీ పెట్టడం వల్ల సరదాగా పోస్టు చేసిందని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ఈమె క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.