టెలివిజన్ షోలు టీఆర్పీ రేట్లే లక్ష్యంగా వివిధ రకాల షోలను నిర్వహిస్తాయి. కానీ కుటుంబసమేతంగా చూసేలా ఆహ్లాదకరంగా ఉంటూ.. ప్రతిభను వెలికి తీసుకురావడంపై దృష్టిసారించే కార్యక్రమాలు కొన్నే ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి కూడా సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమంగా మారాయి. హాస్య నటులు సింగింగ్ షోకి హోస్ట్‌లుగా మారిపోతున్నారు. ఇప్పుడు వారు ఏకంగా లెజెండరీ సింగర్స్‌తో కలిసి పాడుతున్నారు.
తాజాగా ఒక సింగింగ్ షో ఎపిసోడ్‌లో జబర్దస్త్ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ ప్రముఖ సీనియర్ సింగర్ చిత్రతో కలిసి యుగళగీతం ఆలపించాడు. అందం హిందోళం అనే సూపర్ హిట్ పాటను వారిద్దరూ కలిసి పాడారు. అయితే ఇది చాలామంది సంగీత ప్రియులను కలవరపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో పలువురు సుధీర్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. చిత్రమ్మకు బాధగా ఉంది.. అని కొందరు కామెంట్ చేయగా, చాలామంది అదే భావాన్ని ప్రతి ధ్వనించారు.
సుడిగాలి సుధీర్ ప్రతిభావంతుడైన హాస్యనటుడు, అయితే అతన్ని చిత్రమ్మతో యుగళగీతం పాడించడం అన్యాయమని చాలా మంది సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సంగీతాన్ని కామెడీ టేకోవర్ చేయడానికి అనుమతించినందుకు ఆ షోపై కూడా చాలా ట్రోల్స్ వస్తున్నాయి. లెజెండరీ సింగర్, దివంగత బాల సుబ్రహ్మణ్యం హోస్ట్ చేసిన గొప్ప షోలు, ఆయన ప్రదర్శనలను ఆస్వాదించిన అభిమానులకు ఇటీవలి షోలు మరింత చికాకును కలిగిస్తున్నాయి.
ఎస్పీబీ ఇన్నాళ్లూ హోస్ట్ చేసిన సూపర్‌హిట్ సింగింగ్ షో కూడా ఇప్పుడు చాలా కృత్రిమంగా మారిపోయిందంటున్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే టాలెంట్ షోలకి రోజులు గడిచిపోయాయని, ఇప్పుడు టీఆర్పీలే లక్ష్యంగా షోలు నిర్వహిస్తున్నాయని.. అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…