Niharika : సమాజంలో ఎవరికైనా ఎప్పుడైనా సరే ఒక పేరు వచ్చిందంటే చాలు.. దాదాపుగా ఆ పేరు చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది. అది మంచిపేరు కావచ్చు.. చెడ్డది కావచ్చు. మనపై ఒక పేరు పడితే అది చాలా రోజుల వరకు అలాగే ఉంటుంది. అంత సులభంగా దాన్నుంచి బయట పడలేరు. మంచిపేరు అయితే ఫర్వాలేదు. కానీ ఒక్కసారి చెడ్డపేరు పడితే మాత్రం దాని నుంచి బయట పడేందుకు చాలా కాలం పడుతుంది. ఆ సమయంలోగా మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని అనేక రకాలుగా మానసికంగా హింసలకు గురి చేస్తుంటారు. మనల్ని సూటిపోటి మాటలు అంటుంటారు. అవును.. సరిగ్గా నిహారికకు కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని చెప్పవచ్చు. ఆమె పేరు డ్రగ్స్ కేసులో రావడం ఏమోగానీ.. ఆమెనె నెటిజన్లు అసలు విడిచిపెట్టడం లేదు.
తాజాగా నిహారిక తన భర్త చైతన్యతో కలిసి జోర్డాన్ అనే ప్రాంతంలో విహార యాత్రను ఎంజాయ్ చేస్తోంది. స్కై డైవింగ్ చేస్తూ విహరిస్తోంది. భర్తతో కలసి ఆమె ఫారిన్ ట్రిప్‌లో సరదాగా గడుపుతోంది. అయితే ఆమె ఎప్పటికప్పుడు తన విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ఫొటోలకు చాలా మంది స్పందిస్తున్నారు. పాజిటివ్ కన్నా నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా పెడుతున్నారు.

నిహారిక గతంలో జిమ్ ట్రెయినర్‌తో క్లోజ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అదే విషయమో.. మరో కారణమో తెలియదు కానీ.. తరువాత సడెన్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆమె క్లోజ్ చేసింది. అయితే ఇటీవలే ఆ ఖాతాను రీయాక్టివేట్ చేసింది. కానీ జిమ్ ట్రెయినర్‌తో ఉన్న పాత వీడియోను డిలీట్ చేసింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయడం వెనుక కారణం.. సదరు వీడియోనే అని స్పష్టమైంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ తిరిగి వచ్చినా.. ఆమె పేరు డ్రగ్స్‌లో వినబడడం కారణంగా ఆమెను నెటిజన్లు వదిలిపెట్టడం లేదు. ఆమె ప్రస్తుతం జోర్డాన్ టూర్‌లో ఉన్న ఫొటోలపై వారు విమర్శలు చేస్తున్నారు. గతంలో కన్నా ఎక్కువగా వారు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
కాగా నిహారిక పోస్ట్ చేస్తున్న ఫొటోలకు చాలా మంది స్పందిస్తున్నారు. అయితే ఒక ఫొటోకు ఆమె.. నేను ఎక్కడ ఉన్నా స్వర్గాన్ని వెతుక్కుంటాను.. అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్లకు ఒక ఆయుధం లభించినట్లు అయింది. ఆమె క్యాప్షన్‌కు కౌంటర్ ఇస్తున్నారు. గుడికి వెళ్లట్లేదా.. ప్రసాదం తీసుకోవడం లేదా.. అని డ్రగ్స్ కేసుపై పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే.. ఇంకోసారి నువ్వు ఆ కేసులో దొరికితే నిజంగానే స్వర్గం కనిపిస్తుందిలే.. అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. నిహారిక నువ్వు చాలా ధైర్యవంతురాలివి, పిల్లర్‌లాగా బలంగా నిలబడాలి.. అని ఇంకొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇక నిహారిక త్వరలోనే ఓ ట్రావెల్ షో చేయనుందని సమాచారం. అందుకోసమే ప్రస్తుతం ఆమె టూర్స్ వేసి వీడియోలు తీస్తుందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం త్వరలో తెలియనుంది.