Manchu Vishnu : మంచు ఫ్యామిలీపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ జరుగుతోంది. వారు సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టినా సరే నెటిజన్లు వారిని దారుణంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవలే మోహన్ బాబు అగ్ని నక్షత్రం సినిమా అప్‌డేట్ గురించి పోస్ట్ చేశారు. అయితే దానిపై నెటిజన్లు భారీ స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇక ఇప్పుడు మంచు విష్ణు వంతైంది. ఆయనపై కూడా నెటిజన్లు భారీగానే ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏమైందంటే..
నిఖిల్ నటించిన కార్తికేయ 2 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే సినిమా విడుదల తేదీని ఖరారు చేసి ప్రమోషన్స్ చేపట్టారు. కానీ థియేటర్లు దొరకడం లేదని.. దీంతో తన సినిమాను వాయిదా వేసుకోవాల్సి వస్తోందని.. సినిమా రంగంలో రాజకీయాలకు తాను తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని.. నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తన గోడును వెళ్లబోసుకున్నాడు. అయితే నిఖిల్‌కు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన మా ప్రెసిడెంట్, నటుడు మంచు విష్ణు.. నిఖిల్‌కు సపోర్ట్‌గా ఉంటానని తెలిపారు.
నిఖిల్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటానని.. తమ్ముడూ భయపడవద్దని.. నీ సినిమా కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. మంచు విష్ణు ట్వీట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు స్పందించారు. నీకే దిక్కు లేదు.. నువ్వు నిఖిల్‌కు ఎలా సపోర్ట్ ఇస్తావని.. విష్ణును నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అది సరే.. మా అసోసియేషన్ బిల్డింగ్ ఏమైంది చెప్పు.. అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణుకు ట్రోలర్ల నుంచి బాగానే సెగ తగులుతోంది. అయితే వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా పరిశ్రమకు ప్రస్తుతం కష్టాలు తప్పడం లేదు. దీంతో చిన్న, మధ్య బడ్జెట్ సినిమాలకు చెందిన మేకర్స్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇక నిఖిల్ మూవీ ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…