Sania Mirza : భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా భారత దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా కు టాగ్ చేస్తూ ఈమె పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈమె పౌరసత్వాన్ని ఎందుకు రద్దు చేయాలి అనే విషయానికి వస్తే.. టీ20 ప్రపంచకప్ 2021 లో గురువారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్ క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు వెళ్ళిన సానియా మీర్జా.. పాకిస్థాన్ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ స్టేడియంలో కనిపించడంతో ఎంతో మంది నెటిజన్లు ఈమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెపై దారుణంగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆమెపై ఉపా చట్టం పెట్టి దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె పాకిస్తాన్ కి మద్దతు తెలపడంతో చాలామంది శత్రు దేశానికి ఎలా మద్దతు తెలుపుతారు.. అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాక్ పేసర్ హసన్ అలీ భార్యని, తన కుటుంబ సభ్యులను కూడా పాకిస్తాన్ ప్రజలు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అతను చివరి ఓవర్లలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ క్యాచ్ పట్టలేదు. దీంతో పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రజలు తమ బ్యాట్స్‌మన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…