Neha Sharma : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుతతో తెరంగేట్రం చేసింది బీహార్ బ్యూటీ నేహాశర్మ. మొదటి చిత్రం సూపర్ హిట్ అవ్వడం.. ఆ వెంటనే ఈమెకు వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తర్వాత టాలీవుడ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అనంతరం బాలీవుడ్ లో క్రూక్, తేరీ మేరీ కహాని వంటి సినిమాల్లో నటించింది. అవి కూడా నేహాకు మంచి పేరుని తెచ్చిపెట్టలేదు. తమిళ్, పంజాబీ సినిమాల్లో నటించింది కానీ అవి కూడా ఈమెకు కలసి రాలేదు.
ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తన క్యూట్ క్యూట్ పిక్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తోంది. అందాల విందుతో నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు ఈ బ్యూటీ రోజుకో తీరులో దర్శనమిస్తోంది. లేటెస్ట్ గా నేహా హాట్ పిక్స్ తో కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వైట్ కలర్ టైట్ దుస్తుల్లో ఉన్న నేహా నడుచుకుంటూ వచ్చే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అందులో నేహా శర్మని చూసిన నెటిజన్లు అమ్మడికి ఎందుకు ఆఫర్స్ రావడం లేదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల నేహా శర్మ బ్లాక్ కలర్ డ్రెస్‌లో దిగిన పిక్స్ కూడా నెట్టింట హల్‌చల్ చేశాయి. సెల్ఫీలు తీసుకునే క్రమంలో యంగ్ బ్యూటీ ఇలా అందాలను ఆరబోస్తూ తన అభిమానులను అందచందాలతో ఆకట్టుకుంటుంది. నేహా లేటెస్ట్ పిక్స్ చూసిన నెటిజన్లు టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తే బాగుండు అని కామెంట్ చేస్తున్నారు. చూడాలి నేహా రానున్న రోజుల్లో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుందో లేదో.