Neha Oberoi : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకూ ఆయన కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు అందుకున్నారు. 2005 లో పవన్ కళ్యాణ్ నటించిన బాలు చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏ బాయ్ కెన్ డు ఎవ్రీ థింగ్ ఫర్ ఎ గర్ల్ అనే క్యాప్షన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నేహా ఒబెరాయ్, శ్రీయ హీరోయిన్స్ గా నటించారు.
అప్పట్లో బాలు చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం శ్రీయ, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సెకండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ లో నేహా ఒబెరాయ్ అమాయకమైన చూపులతో, తన అందం అభినయంతో క్లాస్ లుక్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలు (పవన్ కళ్యాణ్) ప్రేమించిన అమ్మాయి (నేహా ఒబెరాయ్) చనిపోవడంతో ఈ కథకు మైనస్ పాయింట్ గా మారింది. ప్రేక్షకులను కూడా సెకండాఫ్ కథ అప్పట్లో అంతగా ఆకట్టుకోలేక బాలు చిత్రం యావరేజ్ టాక్ ను అందుకుంది.

సక్సెస్ కాకపోయినా గానీ పవన్ కళ్యాణ్ సరసన నటించిన నేహా ఒబెరాయ్ ని ప్రేక్షకులు ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకున్నారు. ఈమె బాలు చిత్రం తర్వాత మరి ఏ తెలుగు చిత్రంలో కనిపించలేదు. చాలాకాలం గ్యాప్ తర్వాత జగపతిబాబు హీరోగా వచ్చిన బ్రహ్మాస్త్రం చిత్రంలో నటించింది నేహా ఒబెరాయ్. ఈ చిత్రం కూడా ఉన్న మేరకు ఫలితం సాధించలేకపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోవడంతో తెలుగు తెరకు దూరమైంది.
2010లో నేహా డైమండ్ వ్యాపారస్తుడు అయిన విశాల్ షా ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫిలిం అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీలో నేహా ఒక మెంబర్ గా వ్యవహరిస్తుంది. బాలు చిత్రం విడుదలై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న చెక్కుచెదరని అందంతో నాజూకుగా గ్లామర్ మెయింటెన్ చేస్తుంది నేహా అంటూ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.