Nayanthara : అద్భుతమైన నటనతో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం సీనియర్ స్టార్స్‌తో కాకుండా కుర్ర హీరోలతోనూ జత కడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. 37 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తోంది. సుదీర్ఘ కాలంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది.
సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే నయన్ అత్యంత పాపులారిటీని సొంతం చేసుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా.. వుమెన్ ఓరియంటెడ్ చిత్రాలను చేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా మారింది. కొన్నాళ్లుగా విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ ముద్దుగుమ్మ వచ్చే ఏడాది అతనిని వివాహం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే తాజగా నయనతారకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది.
నయనతార తాజాగా చెన్నైలోని పొయెస్ గార్డెన్‌లో ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ విలువ కోట్లలో ఉంటుందని అంచనా. ఇక నయనతార ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఈ ఇంటిలో విఘ్నేష్‌తో కలిసి జీవించనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి నయనతార పెళ్లి వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ గార్డెన్‌కు మంచి సెలబ్రిటీ చరిత్ర కూడా ఉంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్‌ల నివాసాలు ఈ పొయెస్ గార్డెన్‌లోనే ఉన్నాయి. రజనీ కాంత్ ఇంటిపక్కనే ధనుష్ తన డ్రీమ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…