హిందువులు ఎంతో పవిత్రంగా భావించే నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక వస్తువులతో పూజిస్తారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నవరాత్రి ఉత్సవాలకు ఇప్పటికే ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి.
దేవీ నవరాత్రిలో భాగంగా ప్రతి రోజూ అమ్మవారిని అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో వివిధ రకాల నైవేద్యాలతో పూజిస్తారు. ఇక పోతే మొదటి రోజు అమ్మవారిని పూజించడానికి కలశస్థాపన ఏ సమయంలో చేయాలి ?సరైన ముహూర్తం ఏది ? అనే విషయాలను తెలుసుకొని ఆచారం ప్రకారమే కలశస్థాపన చేయాలని పండితులు చెబుతున్నారు.
నవరాత్రులలో అమ్మవారిని పూజించడం కోసం కలశస్థాపన ఉదయం 6:17 నిమిషాల నుంచి 7:07 వరకు మంచి ముహూర్తం అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ ముహూర్తంలోనే అమ్మవారికి కలశస్థాపన చేసి నవరాత్రులు పూర్తయ్యేవరకు కలశాన్ని కదిలించకూడదు. అదేవిధంగా కలశం ముందు వెలిగించిన అఖండ దీపం నిత్యం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి.